Nirmal: వానల్ పాడ్ దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించిన మోహన్ రావు పాటిల్!

Nirmal: నిర్మల్ జిల్లా వానల్ పాడ్ స్వయంబు సింహ సహిత దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రజా ట్రస్ట్ చైర్మన్ బోస్లే మోహన్ రావు పాటిల్!

Srinivas, Mondol Bhainsa
Published on: 20 Oct 2026 4:57 PM IST
Nirmal
X

Nirmal: వానల్ పాడ్ దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించిన మోహన్ రావు పాటిల్!

Nirmal: నిర్మల్ జిల్లా వానల్ పాడ్ గ్రామంలోని ప్రసిద్ధ స్వయంబు సింహ సహిత దుర్గమ్మ ఆలయాన్ని ప్రజా ట్రస్ట్ చైర్మన్ బోస్లే మోహన్ రావు పాటిల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో దర్శించుకుని మొక్కులు సమర్పించారు. అమ్మవారి సన్నిధిలో పూజలు నిర్వహించిన ఆయన భక్తితో ప్రార్థనలు చేశారు. దుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. భక్తి భావంతో ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకోవడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అమ్మవారి దర్శనం భక్తులకు మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తుందని మోహన్ రావు పటేల్ అన్నారు.

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa