Bhainsa: వరంగల్ డిక్లరేషన్ హామీలను వెంటనే అమలు చేయాలి.. కిసాన్ సంఘ్!

Bhainsa: నిర్మల్ జిల్లా భైంసాలో భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో డిమాండ్లు నెరవేర్చాలని వినతి.

Srinivas, Mondol Bhainsa
Published on: 26 Oct 2026 1:23 PM IST
Bhainsa
X

Bhainsa: వరంగల్ డిక్లరేషన్ హామీలను వెంటనే అమలు చేయాలి.. కిసాన్ సంఘ్!

Bhainsa: వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేసింది. రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్ విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపించింది.

వరంగల్ డిక్లరేషన్ లో అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటికి 65 లక్షల మంది అర్హుల్లో 25 లక్షల 36 వేల మందికి మాత్రమే రుణమాఫీ చేశారని తెలిపారు. ఇంకా 39 లక్షల మందికి చేయాల్సి ఉందని, బ్యాంకుల పేరు మార్పిడితో 64 వేల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని, వారికి వడ్డీతో సహా వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

ప్రధాన డిమాండ్లు:

అన్ని పంటలకు MSP పై 500 రూపాయలు బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలి. కేవలం కొన్ని రకాల ధాన్యానికే కాదు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు.. కానీ 8 గంటలు కూడా సరిగా ఇవ్వడం లేదు. హామీ ప్రకారం విద్యుత్ ఇవ్వాలి. రైతు భరోసా ఎకరాకు 15 వేలు ఇస్తామన్నారు. మూడేళ్లు అయింది.. ఎకరాకు 45 వేలు బకాయి ఉంది. వెంటనే చెల్లించాలి.

భూమిలేని రైతు కూలీలకు ఏడాదికి 12 వేల చొప్పున మూడేళ్లకు 36 వేలు చెల్లించాలి. రైతు బీమా 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచి పునరుద్ధరించాలి. పోడు, అసైన్డ్ భూములకు పట్టా హోదా కల్పించాలి, 22A నుండి పట్టా భూములను తొలగించాలి.

మూతబడ్డ నిజాం, మెట్టుపల్లి, బోధన్, సారంగాపూర్ షుగర్ ఫ్యాక్టరీలను తెరిచి చెరుకు ధర టన్నుకు 5 వేలు చేయాలి. ప్రతి కమతానికి దారి, నీరు అందించాలి, కోతులు, అడవి పందుల నుండి పంటలను కాపాడి నష్టపరిహారం ఇవ్వాలి. రైతుల ఓట్లతో గెలిచి హామీలు మరిచారని, సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని కిసాన్ సంఘ్ హెచ్చరించింది.

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa