Bhainsa: భైంసాలో ఘనంగా భగత్ సింగ్ జయంతి - నివాళులర్పించిన యువసేన సభ్యులు!

Bhainsa: నిర్మల్ జిల్లా భైంసాలో ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన భగత్ సింగ్ యువసేన సభ్యులు.

Srinivas, Mondol Bhainsa
Published on: 28 Sept 2026 12:13 PM IST
Bhainsa
X

Bhainsa: భైంసాలో ఘనంగా భగత్ సింగ్ జయంతి - నివాళులర్పించిన యువసేన సభ్యులు!

Bhainsa: భైంసాలో భగత్ సింగ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భగత్ సింగ్ యువసేన సభ్యులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా యువసేన సభ్యులు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్ చేసిన త్యాగాలు, పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని అన్నారు. యువత భగత్ సింగ్‌ను ఆదర్శంగా తీసుకుని దేశ సేవలో ముందుకు సాగాలని సూచించారు.

దేశభక్తి భావాలను యువతలో మరింత పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో యువసేన సభ్యులు సుదర్శన్, శ్రీనివాస్, దేవేందర్, సూర్యనారాయణ పాల్గొన్నారు.

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa