Bhainsa: తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మిగిలిన చిన్నారి

Bhainsa: నిర్మల్ జిల్లా భైంసాలో హృదయవిదారక ఘటన. తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మిగిలిన ఐదో తరగతి బాలిక. చందాలు వేసి అంత్యక్రియలు నిర్వహించిన కాలనీవాసులు.

Srinivas, Mondol Bhainsa
Published on: 19 Oct 2026 4:23 PM IST
Bhainsa
X

Bhainsa: తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మిగిలిన చిన్నారి

భైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని భట్టి గల్లీలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఆరేళ్ల క్రితం తండ్రి సాయినాథ్ మృతి చెందగా.. తాజాగా తల్లి గంగామణి కూడా అనారోగ్యంతో కన్నుమూసింది. దీంతో ఐదో తరగతి చదువుతున్న చిన్నారి అనాథగా మిగిలింది.

ఆ నిరుపేద కుటుంబానికి కనీసం అంత్యక్రియలు నిర్వహించే స్థోమత కూడా లేకపోవడంతో.. భట్టి గల్లీ కాలనీవాసులే చందాలు వేసుకుని అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన ఈ బాలికను ప్రభుత్వం వెంటనే ఆదుకుని.. చదువుతో పాటు నివాసానికి భరోసా కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa