Bhainsa: తల్లిని కోల్పోయిన చిన్నారికి ఆర్థిక సాయం అందించిన బైంసా చైర్మన్!

Bhainsa: నిర్మల్ జిల్లా బైంసా మున్సిపల్ చైర్మన్ తూమొల్ల దత్తాత్రి తల్లిని కోల్పోయిన చిన్నారికి రూ.11,000 ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.

Srinivas, Mondol Bhainsa
Published on: 27 Oct 2026 8:38 AM IST
Bhainsa
X

Bhainsa: తల్లిని కోల్పోయిన చిన్నారికి ఆర్థిక సాయం అందించిన బైంసా చైర్మన్!

Bhainsa: తల్లిని కోల్పోయి కష్టాల్లో ఉన్న చిన్నారికి మున్సిపల్ చైర్మన్ తూమొల్ల దత్తాత్రి గారు తన వంతు సహాయంగా రూ.11,000 ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.

తల్లిని కోల్పోయిన బిడ్డకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఆయన ఈ విరాళాన్ని అందజేశారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, నిరుపేదలకు సహాయం చేయడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ ఆర్థిక సాయంతో పాటు, ఆ చిన్నారి విద్యాభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa