Bhainsa: ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు సమర్పించాలి.. మున్సిపల్ చైర్మన్ దత్తు!
Bhainsa: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పత్రాలను కౌన్సిలర్ల వద్ద సమర్పించాలని మున్సిపల్ చైర్మన్ తూమొల్ల దత్తాత్రి విజ్ఞప్తి చేశారు.
Bhainsa: ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు సమర్పించాలి.. మున్సిపల్ చైర్మన్ దత్తు!
Bhainsa: భైంసా పట్టణంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమ ఇళ్లకు సంబంధించిన పత్రాలను వీలైనంత త్వరగా తమ తమ వార్డు కౌన్సిలర్ల వద్ద సమర్పించాలని మున్సిపల్ చైర్మన్ తూమొల్ల దత్తాత్రి విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ దత్తు మాట్లాడుతూ ప్రతిపక్ష MIM పార్టీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని విమర్శించారు. నిన్న నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో MIM పార్టీ కౌన్సిలర్లు మాస్టర్ ప్లాన్‌కు మద్దతు ఇస్తామని, భైంసా పట్టణ అభివృద్ధిని కోరుకుంటున్నామని ప్రకటించారని తెలిపారు.
అయితే, నేడు నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ అజెండా సమావేశంలో అదే MIM పార్టీ కౌన్సిలర్లు మాస్టర్ ప్లాన్‌ను వ్యతిరేకించారని పేర్కొన్నారు.
ప్రజల ముందు ఒక మాట.. కౌన్సిల్ సమావేశంలో మరో మాట చెప్పడం MIM పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని చైర్మన్ దత్తు విమర్శించారు. భైంసా పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.




