Nirmal: భైంసా మాస్టర్ ప్లాన్‌పై అభిప్రాయాలు, సలహాలు తెలియజేయాలి!

Nirmal: Bhainsa Master Plan, Ramarao Patel MLA, Thumolla Dattatri, Bhavesh Mishra Collector, Bhainsa Town Development, Nirmal

Srinivas, Mondol Bhainsa
Published on: 28 Oct 2026 5:45 PM IST
Nirmal
X

Nirmal: భైంసా మాస్టర్ ప్లాన్‌పై అభిప్రాయాలు, సలహాలు తెలియజేయాలి!

Nirmal: భైంసా పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్‌పై ప్రజలు, నాయకులు, వ్యాపారవేత్తలు తమ తమ అభ్యంతరాలు, అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తెలియజేయాలని ఎమ్మెల్యే రామారావు పటేల్, మున్సిపల్ చైర్మన్ తూమోల్ల దత్తాత్రి మీడియా సమక్షంలో కోరారు. బుధవారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, డీటీసీపీ డ్రాఫ్ట్ బృందం సభ్యులు, నాయకులు అధికారులతో కలిసి మాస్టర్ ప్లాన్‌పై సమీక్షించారు.

ప్రస్తుతం పరిశ్రమలు లేని పారిశ్రామిక జోన్ల కారణంగా ఇళ్ల నిర్మాణ అనుమతులకు ఎదురవుతున్న ఇబ్బందులు మాస్టర్ ప్లాన్‌తో తొలగుతాయని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాల వంటి మౌలిక వసతులు మెరుగుపడి పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.రైతుల వ్యవసాయ భూములకు నష్టం జరగదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa