Nirmal: భైంసాలో గణేష్ నిమజ్జన శోభాయాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు!

Nirmal: భైంసాలో మంగళవారం జరిగే గణేష్ నిమజ్జన శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, 80 సీసీ కెమెరాలతో నిఘా ఉంచామని మున్సిపల్ చైర్మన్ దత్తు తెలిపారు.

Srinivas, Mondol Bhainsa
Published on: 20 Sept 2026 11:47 AM IST
Nirmal
X

Nirmal: భైంసాలో గణేష్ నిమజ్జన శోభాయాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు!

Nirmal: నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీలో చైర్మన్ దత్తు మీడియా సమావేశం నిర్వహించారు.మంగళవారం నిర్వహించే గణేష్ నిమజ్జన శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. మునిసిపాలిటీ తరఫున తరపున

పట్టణంలో దాదాపు 80 సీసీ కెమెరాలతో నిఘా ఉంచామని, ప్రత్యేకంగా గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ వద్ద ప్రత్యేక సీసీ కెమెరా ఏర్పాటు చేశామన్నారు.

శోభాయాత్ర మార్గంలో స్పీడ్ బ్రేకర్లు, గుంతలను సరిచేశామని తెలిపారు. అందరూ శాంతియుతంగా, సోదరభావంతో శోభాయాత్ర జరుపుకోవాలని, మన ధర్మాన్ని కాపాడుకుంటూనే ఇతర ధర్మాలను కూడా గౌరవించాలని కోరారు.సోషల్ మీడియాలో వచ్చే వార్తలు గాని, వీడియోస్ గాని నమ్మవద్దు, శాంతియుతంగా శోభాయాత్ర జరుపుకోవాలని, ఏదైనా సమస్య ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa