Basara: బాసర పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన భైంసా ఏఎస్పీ సాయికిరణ్!

Basara: నిర్మల్ జిల్లా బాసర పోలీస్ స్టేషన్‌ను భైంసా ఏఎస్పీ సాయికిరణ్ ఐపీఎస్ సందర్శించారు.

RAMESH RATNELLI, BASARA
Published on: 15 Nov 2026 11:34 AM IST
Basara
X

Basara: బాసర పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన భైంసా ఏఎస్పీ సాయికిరణ్!

Basara: భైంసా సబ్ డివిజన్ ఏఎస్పీ సాయికిరణ్ IPS శనివారం బాసర పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ పరిధిలోని కేసుల పురోగతి, పోలీస్ స్టేషన్ నిర్వహణ, వివిధ రికార్డులు మరియు ఫైళ్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా హిస్టరీ షీట్లు, పాత పెండింగ్ కేసులు, ఇటీవల నమోదైన కేసులు మరియు ప్రజల నుంచి అందిన ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించారు.

కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, పెండింగ్ కేసులను సకాలంలో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అలాగే ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

వచ్చే పుష్కరాలకు సంబందించిన ముందు జాగ్రత్త చర్యల గురించి, వాహనాల పార్కింగ్ ప్రదేశాల గురించి సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాసర ఎస్‌హెచ్‌ఓ దీపక్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RAMESH RATNELLI, BASARA

RAMESH RATNELLI, BASARA