Basara: ఘనంగా ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలు

Basara: నిర్మల్ జిల్లా బాసర కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి, కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు.

RAMESH RATNELLI, BASARA
Published on: 19 Nov 2026 5:34 PM IST
Basara
X

Basara: ఘనంగా ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలు

బాసర: కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని, భారతదేశపు ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరా గాంధీ గారి 109వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ముమ్మాయి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా నాయకులు ఇందిరా గాంధీ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు.

చివరగా నాయకులు ఇందిరమ్మ ఆశయ సాధనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో బాసర టౌన్ ప్రెసిడెంట్ రాజేశ్వర్ దేశ్ముఖ్, మాజీ ఎంపీటీసీ ఖలీల్, సీనియర్ నాయకుడు సంజీవరావు, ఆత్మ డైరెక్టర్లు శ్రీనివాస్ పటేల్ మరియు షేక్ జలీల్, జంగం రాజేందర్, అనిల్, దేవన్న, గంగా ప్రసాద్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముమ్మాయి రమేష్ మాట్లాడుతూ, ఇందిరా గాంధీ గారు దేశ సమైక్యత, పేదల సంక్షేమం, బ్యాంకుల జాతీయీకరణ, బంగ్లాదేశ్ విముక్తి వంటి ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలతో భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టారని కొనియాడారు. ఆమె ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బాసరలో మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

RAMESH RATNELLI, BASARA

RAMESH RATNELLI, BASARA