Nirmal: భైంసాలో బస్సును ఢీకొన్న ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు!
Nirmal: నిర్మల్ జిల్లా భైంసాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సును ఆటో ఢీకొనడంతో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించారు.
Nirmal: భైంసాలో బస్సును ఢీకొన్న ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు!
Nirmal: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సును ఆటో ఢీకొనడంతో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. పట్టణంలోని రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద ఎదురుగా వస్తున్న బస్సును ఆటో బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అయింది.
తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ ను ప్రథమ చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




