Nirmal: చిట్యాలలో ఉచిత జీర్ణవ్యవస్థ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్!

Nirmal: చిట్యాల జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో టీం విమలాకర్ ఫౌండేషన్, అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో 53వ కుంజర యాత్ర ఉచిత జీర్ణవ్యవస్థ క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 10 Oct 2026 11:24 AM IST
Nirmal
X

Nirmal: చిట్యాలలో ఉచిత జీర్ణవ్యవస్థ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్!

Nirmal: నిర్మల్ రూరల్ మండలం చిట్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ మైదానంలో టీం విమలాకర్ ఫౌండేషన్, అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో 53వ కుంజర యాత్ర ( ఉచిత జీర్ణవ్యవస్థ క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ క్లినిక్) నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కు చెందిన సుమారు 50 మంది వైద్యులు ప్రజలకు ఉచిత పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందజేశారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి గ్రామం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

అల్ట్రా సౌండ్ అబ్డోమెన్, ఫైట్రో స్కాన్, సీరం క్రియాటిన్, హెచ్బిఎస్, ఎండోస్కోపీ, టుడే ఈకో లాంటి ఖరీదైన పరీక్షలను ఉచితంగా చేపట్టారు. గ్రామంలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు గ్రామ సర్పంచ్ ఏనుగు సుప్రియ వెంకటరెడ్డి, వీడీసీ సభ్యులు, వైద్యులకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అవసరమైన వారికి హైదరాబాద్ రిఫర్ చేశారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL