Basara: నదిలోకి దూకుతున్న వ్యక్తిని సమయస్ఫూర్తితో కాపాడిన గ్రామస్తులు!
Basara: బాసర గోదావరి బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని గ్రామస్తులు గెంటిల లింబాద్రి, పద్మారావు సమయస్ఫూర్తితో కాపాడారు.
Basara: నదిలోకి దూకుతున్న వ్యక్తిని సమయస్ఫూర్తితో కాపాడిన గ్రామస్తులు!
Basara: బాసర మండల కేంద్రమైన బాసర గోదావరి వంతెనపై సోమవారం ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయగా, స్థానిక గ్రామస్తులు సమయస్ఫూర్తితో వ్యవహరించి కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. బాసరకు చెందిన గెంటిల లింబాద్రి, పద్మారావు గ్రామస్తులు యంచ గ్రామం నుండి తిరిగి బాసరకు వస్తున్నారు.
ఈ క్రమంలో గోదావరి బ్రిడ్జిపై ఒక వ్యక్తి నదిలోకి దూకేందుకు ప్రయత్నించడాన్ని వారు గమనించారు. వెంటనే అప్రమత్తమైన లింబాద్రి, పద్మారావు క్షణాల్లో స్పందించి ఆ వ్యక్తిని పట్టుకుని వెనక్కి లాగారు. నదిలో దూకకుండా నిలువరించి ప్రాణాలు కాపాడారు.
అనంతరం ఈ ఘటనపై బాసర పోలీసులకు సమాచారం అందించి, సదరు వ్యక్తిని వారికి అప్పగించారు. ఆపదలో ఉన్న వ్యక్తి ప్రాణాలను కాపాడేందుకు చాకచక్యంగా వ్యవహరించిన లింబాద్రి, పద్మారావులను బాసర గ్రామస్తులతో పాటు స్థానికులు ముక్తకంఠంతో అభినందించారు. వారి సమయస్ఫూర్తిని పలువురు కొనియాడారు.




