Adilabad: రైల్వే లైన్ మళ్లింపుపై యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో

Adilabad: ఆదిలాబాద్ జిల్లా బేలలో రైల్వే లైన్ మళ్లింపును వ్యతిరేకిస్తూ యూత్ కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించాలని డిమాండ్.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 30 Sept 2026 8:47 PM IST
Adilabad
X

Adilabad: రైల్వే లైన్ మళ్లింపుపై యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో

అదిలాబాద్: రైల్వే లైన్ మళ్లింపు పై యూత్ కాంగ్రెస్ ఆందోళన.. రైల్వే లైన్ దారి మళ్ళీ పై అదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ నాయకుల నిరసన చేపట్టారు..స్థానిక ఎంపీ,ఎమ్మెల్యేలు స్పందించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.

గతంలో అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2009 లో పేద ప్రజల రవాణా సౌకర్యం నిమిత్తం మహారాష్ట్రలోని గడి చందుర్,బేల,జైనథ్ మీదుగా నూతన రైల్వే లైన్ ఏర్పాటుకు గెజిట్ విడుదల చేసిందని ఇప్పుడు దాని ప్రకారమే నూతన రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో బేల మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేపట్టారు. యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో మండలంలోని కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ నాయకుల పెద్ద ఎత్తున తరలివచ్చి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సామ రూపేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బడా వ్యాపారస్తులకు కొమ్ముకాస్తుందని ఆరోపించారు. 2009లో కాంగ్రెస్ సర్కార్ పేద ప్రజలకు సులభమైన రవాణా సౌకర్యం కల్పించాలని సదుద్దేశంతో మహారాష్ట్రలోని గడిచందుర్ నుంచి తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో గల బేల,జైనథ్ మీదుగా నూతన రైల్వే లైనుకు శ్రీకారం చుట్టి గెజిట్ విడుదల చేసిందని అన్నారు.

అయితే అప్పటి గెజిట్ ప్రకారం ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా మహారాష్ట్రలోని గడి చందూర్ లో ఆదాని అంబానీలవ్యాపారాలను దృష్టిలో ఉంచుకొని పాత గెజిట్ ప్రకారంగాకొత్త గెజిట్ ప్రకారం మహారాష్ట్రలోని గడిచందూర్ ముకుడు బంద్ ప్రాంతాల మీదుగా రైల్వే ఏర్పాటు చేసేందుకు కుట్ర పన్నుతుందని ఆరోపించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.