Adilabad: ఆటోలో గాడిద ప్రయాణం వినూత్న రీతిలో ఉపాధి పొందుతున్న వ్యక్తి!

Adilabad: ఆదిలాబాద్‌కు చెందిన వెంకటేష్ వారసత్వంగా వచ్చిన గాడిదలను ఆటోలో తరలిస్తూ, గ్లాస్ రూ. 100 చొప్పున ఔషధ గుణాలున్న గాడిద పాలను విక్రయిస్తున్నాడు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 20 Sept 2026 11:34 AM IST
Adilabad
X

Adilabad: ఆటోలో గాడిద ప్రయాణం వినూత్న రీతిలో ఉపాధి పొందుతున్న వ్యక్తి!

Adilabad: గతంలో గాడిద పాలను విక్రయించేందుకు కోసం ఊరూరా తిరుగుతూ పొట్ట పోసుకునేవారు... ప్రస్తుతం పరిస్థితులు మారాయి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లాలి అంటే కష్టంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వెంకటేష్ కు వారసత్వంగా వచ్చిన మూడు గాడిదలను సాదుకుంటూ కుటుంబ పోషణ చేస్తున్నాడు... ఔషధ గుణాలు ఉన్న గాడిద పాలకు తన ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిమాండ్లు పెరగడంతో ఆదిలాబాద్ టౌన్ నుంచి ఇతర గ్రామాలకు వెళ్లాలంటే గాడిదలను వెంట తీసుకువెళ్లి కాలినడకన వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వెంకటేష్ ఓ పాత ఆటోలో కొనుగోలు చేసి అందులోనే గాడిదలను కూర్చోబెట్టి గ్రామ గ్రామాన తిరుగుతూ వంద రూపాయల గ్లాస్ చొప్పున గాడిద పాల విక్రయాలు చేస్తూ పొట్ట పోసుకుంటున్నాడు... అయితే ఆటోలో గాడిదలు పల్లె ప్రాంతానికి తరలివస్తుండడంతో.. అందరూ పాపం గాడిద కష్టం తీరిందంటూ చమత్కారంగా మాట్లాడుకోవడం కనిపిస్తోంది....

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.