Utnoor: ఘనంగా భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకలు

Utnoor: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి, గిరిజన గౌరవ దినోత్సవాన్ని ఎంపీ గోడం నాగేష్, కలెక్టర్ రాజర్షి షా ఘనంగా నిర్వహించారు.

Y RAMESH, ITDA UTNOOR
Published on: 15 Nov 2026 4:31 PM IST
Utnoor
X

Utnoor: ఘనంగా భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకలు

ఉట్నూర్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ గిరిజనుల ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణ కోసం బ్రిటిష్ పాలకులపై అలుపెరగని పోరాటం చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు, గిరిజనుల ఆరాధ్య దైవం భగవాన్ బిర్సా ముండా ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ గిరిజన సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నాగేష్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు.

భగవాన్ బిర్సా ముండా 151వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఉట్నూర్‌లోని కే బి కాంప్లెక్స్ హల్ లో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గిరిజన గౌరవ దినోత్సవం’ వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ గోడం నాగేష్, కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీఓ మంద మకరంద్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Y RAMESH, ITDA UTNOOR

Y RAMESH, ITDA UTNOOR