Adilabad: భారీ స్కాం బట్టబయలు: ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్!

Adilabad: యూనిక్ కంపెనీ పేరుతో ప్రజల నుంచి వందల కోట్లు వసూలు చేసి మోసగించిన ప్రధాన నిందితుడు రాజ్ కుమార్ రాయ్‌ను అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 14 Oct 2026 7:56 PM IST
Adilabad
X

Adilabad: భారీ స్కాం బట్టబయలు: ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్!

ఆదిలాబాద్: యూనిక్ కంపెనీ పేరుతో భారీ మోసం చేసిన ప్రధాన నిందితుడు కంపెనీ డైరెక్టర్ రాజ్ కుమార్ రాయ్ ను అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బుధవారం ఏ ఆర్ హెడ్ కోటర్స్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు.

నిందితుడు ప్రజల వద్ద భారీ పెట్టుబడులు సేకరించి మోసం చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వందల కోట్ల రూపాయల మోసం చేసినట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. మోసం చేసిన సొమ్ముతో నిందితుడు హోటళ్లు, భూములు, ప్లాట్లు ను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.