Adilabad: వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం

Adilabad: ఆదిలాబాద్ శాస్త్రి మందిరం నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం శుక్రవారం రాత్రి వైభవంగా సాగింది. ఎమ్మెల్యే పాయల్ శంకర్ రథయాత్రను ప్రారంభించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 30 Oct 2026 9:14 PM IST
Adilabad
X

Adilabad: వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం

ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని శాస్త్రి మందిరం నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం ను శుక్రవారం రాత్రి వైభవంగా నిర్వహించారు.

వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు జరిపి స్వామివారి ఉత్సవ మూర్తిని రథంలో ఉంచి పుర వీధుల్లో ఊరేగించారు.

పెద్ద సంఖ్యలో హాజరైన భక్తుల గోవిందా నామస్మరణ నడుమ రథోత్సవం కన్నులపండువగా సాగింది. ఎమ్మెల్యే పాయల్ శంకర్ కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరై రథయాత్రను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జోగు శైలజా రవి, రవికాంత్ మనోజ్ జీవన్ తదితరులున్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.