Adilabad: అమ్మవారికి మహా హారతి సమర్పించిన ఎస్పీ.. నవరాత్రుల శుభాకాంక్షలు!
Adilabad: దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఆదిలాబాద్‌లోని శాకంబరీ మాత ఆలయాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు, మహా హారతిలో పాల్గొన్నారు.
Adilabad: అమ్మవారికి మహా హారతి సమర్పించిన ఎస్పీ.. నవరాత్రుల శుభాకాంక్షలు!
ఆదిలాబాద్: దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల భాగంగా ఆదిలాబాద్ లోని శాకంబరీ మాత ఆలయాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం సాయంత్రం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మహా ఆరతి లో ఎస్పీ పాల్గొని.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం శ్రీ నవదుర్గ మండపాన్ని దర్శించుకుని దుర్గామాతకు పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు ఎస్పీని శాలువాతో సత్కరించారు.




