Adilabad: వినాయక మండపాలను సందర్శించిన ఎస్పీ అఖిల్ మహాజన్

Adilabad: ఆదిలాబాద్‌లో వినాయక మండపాలను సందర్శించిన ఎస్పీ అఖిల్ మహాజన్. నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడి.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 16 Sept 2026 10:35 PM IST
Adilabad
X

Adilabad: వినాయక మండపాలను సందర్శించిన ఎస్పీ అఖిల్ మహాజన్

ఆదిలాబాద్: గణపతి నవరాత్రి ఉత్సవాలను ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో జరగడానికి యువతతో నేరుగా మాట్లాడుతూ పోలీసు ప్రజల సత్సమండాలను మెరుగుపరచడానికి జిల్లా పోలీసు యంత్రాంగం కృషి చేస్తుందని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.

ఆదిలాబాద్ పట్టణంలోని పలు ప్రధాన గణపతి మండపాలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా దర్శించి పూజా కార్యక్రమాల నిర్వహించి గణనాథుని సేవలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ పట్టణంలోని కూలిపుర మరియు వినాయక చౌక్ ప్రాంతాలలోని పలు ప్రధాన గణపతి మండపాలను దర్శించి గణపతి మండప కమిటీ సభ్యులతో నేరుగా మాట్లాడి నిమజ్జనాన్ని సరైన సమయంలో పూర్తి చేయాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

దాదాపు పట్టణంలోని 5 మండపాలను దర్శించి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మండపాల వద్ద జిల్లా ఎస్పీ గారిని ఘనంగా సత్కరించిన గణపతి మండప కమిటీ సభ్యులు. మండపాలలో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

నిమర్జనం ఉత్సవాలలో ఎలాంటి డీజే లకు మరియు లేజర్ లైట్ లకు, పేపర్ చెల్లె యంత్రాలకు అనుమతి లేదని తెలిపారు. ఎలాంటి అత్యవసరసమయంలోనైనా డయల్ 100 ద్వారా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. గణపతి నిమర్జనాన్ని సరైన సమయంలో పూర్తిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.