Adilabad: ఆదిలాబాద్‌లో దారుణం.. సొంత చెల్లిపై అన్న లైంగిక దాడి!

Adilabad: ఆదిలాబాద్ పట్టణంలో వావివరసలు మరిచి సొంత చెల్లిపై (16) నెల రోజులుగా లైంగిక దాడికి పాల్పడుతున్న అన్నను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 25 Nov 2026 7:44 AM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్‌లో దారుణం.. సొంత చెల్లిపై అన్న లైంగిక దాడి!

ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలో ఆ మానియా ఘటన వెలుగు చూసింది.. వావివరసలు మరిచి సొంత చెల్లి పైనే ఓ దుర్మార్గుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆదిలాబాద్ చర్చని అంశంగా మారింది. మహారాష్ట్రకు చెందిన ఓ బాలిక(16) తల్లి మృతి చెందడంతో కొన్నేళ్లుగా తండ్రి, తమ్ముడు, అన్నతో కలిసి ఆదిలాబాద్ పట్టణంలోని ఒక కాలనీలో నివాసముంటోంది. తొమ్మిదో తరగతివరకు చదివి మానేసిన ఆమె ఇంటివద్దనే ఉంటోంది.

డ్రైవర్గా పనిచేసే అన్నయ్య నెల రోజులుగా ఆమెను భయపెట్టి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ అతడు భయపెట్టడంతో ఆమె ఇన్నాళ్లూ ఎవరికీ చెప్పకుండా మానసికంగా కుమిలిపోయింది. ఈ క్రమంలో మంగళవారం బాలిక పోలీసుస్టేషన్కు వచ్చి విలపిస్తూవిషయం చెప్పటంతో పోలీసులు ఆమెకు వైద్య పరీక్షలు చేయించి భరోసాకేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.