Adilabad: నేరడిగొండ వద్ద కేటీఆర్‌కు అపూర్వ స్వాగతం!
Adilabad: ఆదిలాబాద్‌లో జరగనున్న ‘రైతు గర్జన’ సభకు విచ్చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నేరడిగొండ టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఘన స్వాగతం పలికారు.
Adilabad: నేరడిగొండ వద్ద కేటీఆర్‌కు అపూర్వ స్వాగతం!
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన 'రైతు గర్జన' బహిరంగ సభకు హాజరయ్యేందుకు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నేరడిగొండ టోల్ ప్లాజా వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో తరలివచ్చిన అశేష గులాబీ దళం కేటీఆర్‌కు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి స్వాగతించారు. జై తెలంగాణ, జై కేటీఆర్ నినాదాలతో టోల్ ప్లాజా పరిసరాలు మార్మోగాయి.
అక్కడి నుంచి ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఇతర ముఖ్య నేతలతో కలిసి కేటీఆర్ భారీ కాన్వాయ్ తో ఆదిలాబాద్ సభా ప్రాంగణానికి బయలుదేరారు. వందలాది వాహనాలతో సాగిన ఈ ర్యాలీతో జాతీయ రహదారిపై పండుగ వాతావరణం నెలకొంది. రైతాంగ సమస్యలపై గళమెత్తేందుకు నిర్వహించిన ఈ రైతు గర్జన సభకు మార్గమధ్యంలోనే ప్రజలు, కార్యకర్తల నుంచి విశేష స్పందన లభించడం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. కేటీఆర్ కన్వయ్ వెంట గులాబి దండు రైతు గర్జన సభకు బయలు దేరారు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.




