Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో తీవ్ర భద్రతా లోపం - వెంటిలేటర్ల చోరీ!

Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో తీవ్ర భద్రతా లోపం. ఆర్‌ఐసీయూ విభాగం నుంచి రెండు వెంటిలేటర్లు చోరీ చేసిన దొంగలు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా కేసు నమోదు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 4 Nov 2026 9:29 AM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో తీవ్ర భద్రతా లోపం - వెంటిలేటర్ల చోరీ!

Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ లో తీవ్ర భద్రత లోపం చోటు చేసుకుంది. రోగులకు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే వెంటిలేటర్లను ఇద్దరు నిందితులు ఎత్తుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గత నెల 30న రిమ్స్ లోని రెండో అంతస్తులో ఉన్న ఆర్ఐసియు విభాగంలో సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు దొంగలు వెంటిలేటర్లను సంచిలో పెట్టుకొని దర్జాగా తీసుకెళ్లే దృశ్యాలు సిసి ఫుటేజ్ లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై డైరెక్టర్ టూ టౌన్ లో ఫిర్యాదు చేశారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.