Adilabad: ఆదిలాబాద్ రైల్వే స్టేషన్‌లో ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక తనిఖీలు!

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో అక్రమ రవాణా, గంజాయి రవాణా, దొంగతనాలను అరికట్టేందుకు శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్‌లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 15 Nov 2026 11:45 AM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్ రైల్వే స్టేషన్‌లో ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక తనిఖీలు!

అదిలాబాద్: అదిలాబాద్ జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, అక్రమ రవాణా, గంజాయి రవాణా, దొంగతనాలను అరికట్టేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్‌లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పట్టణ పోలీస్ అధికారులతో కలిసి ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించి, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీస్ అధికారులకు సూచించారు. అక్రమ రవాణా, గంజాయి రవాణా, దొంగతనాలు వంటి నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, రైల్వే స్టేషన్ పరిధిలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి. సునీల్ కుమార్, టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె. నాగరాజు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.