Adilabad: ఆదిలాబాద్‌లో పోలీసుల తనిఖీలు..137 వాహనాలు స్వాధీనం!

Adilabad: ఆదిలాబాద్ పిట్టలవాడలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్. సరైన పత్రాలు లేని 137 వాహనాలు సీజ్.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 7 Oct 2026 11:50 AM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్‌లో పోలీసుల తనిఖీలు..137 వాహనాలు స్వాధీనం!

Adilabad: ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని పిట్టలవాడ కాలనీలో సుమారు 150 మంది పోలీసు సిబ్బందితో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

తనిఖీల సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని 116 ద్విచక్ర వాహనాలు, 20 ఆటోలు, ఒక కారును తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నారు. నంబర్ ప్లేట్లు లేని 6 వాహనాలు, నంబర్ ప్లేట్లను చెరిపివేసిన 2 వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాహనాలకు సంబంధించిన పూర్తి పత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలని, దొంగ వాహనాలను కొనుగోలు చేయడం లేదా వినియోగించడం నేరమని హెచ్చరించారు.

వాహనాల నంబర్ ప్లేట్లను చెరిపివేయడం, మార్చడం వంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. గంజాయి రహిత ఆదిలాబాద్ కోసం ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు. మహిళలు, చిన్నారుల పట్ల ప్రతి ఒక్కరూ గౌరవంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. రౌడీ షీటర్ల పై సస్పెక్ట్ షీటర్ల పై తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని ప్రవర్తన మార్చుకొని సత్ప్రవర్తనతో ఎదగాలని సూచించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.