Adilabad: ఆదిలాబాద్ రోడ్డు ప్రమాదం: సురక్షితంగా బయటపడిన ఎస్ఐ సిబ్బంది!

Adilabad: ఆదిలాబాద్ ఇచ్చోడ మండలం ముక్రా బస్టాండ్ సమీపంలో పోలీసులు ప్రయాణిస్తున్న కారు కంటైనర్‌ను ఢీకొనడంతో ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, సురక్షితంగా బయటపడ్డారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 1 Oct 2026 9:33 AM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్ రోడ్డు ప్రమాదం: సురక్షితంగా బయటపడిన ఎస్ఐ సిబ్బంది!

Adilabad: అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ పీఎస్ పరిధిలోని ముక్రా గ్రామ 44 వ నెంబర్ జాతీయ రహదారి బస్టాండ్ సమీపంలో పోలీసులు ప్రయాణిస్తున్న కారు బుధవారం రాత్రి ప్రమాదానికి గురైంది. ఒక కేసు దర్యాప్తులో భాగంగా ఆదిలాబాద్ వన్డేన్ ఎస్ఐ సంజయ్, హెడ్కానిస్టేబుల్ రుక్మారెడ్డి, కానిస్టేబుళ్లు హనుమంతు, రంజీత్రెడ్డిలు హైదరాబాద్కు ఒక ప్రైవేటు కారులో బయలు దేరారు.

ముక్రా బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న కంటైనర్ డ్రైవర్ ఒకే సారి బ్రేకులు వేయటంతో పోలీసులు ప్రయాణిస్తున్న కారు కంటైనర్ వెనుక ఢీకొంది. అదృష్ట వశాత్తు పోలీసులకు ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. అయితే కారు ముందు భాగం మాత్రం నుజ్జునుజ్జు అయింది.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.