Adilabad: ఆదిలాబాద్‌లో ట్రాక్టర్ మోసాల అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు!

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో ట్రాక్టర్ల లీజు పేరుతో మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు. 6 ట్రాక్టర్లు స్వాధీనం, ఐదుగురు నిందితుల అరెస్ట్.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 1 Nov 2026 1:09 PM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్‌లో ట్రాక్టర్ మోసాల అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు!

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో ఫైనాన్స్ వాయిదాలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్న రైతులను లీజు పేరుతో నమ్మించి, ట్రాక్టర్లను మహారాష్ట్రకు తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు మట్టుబెట్టారు. ఈ కేసుకు సంబంధించి రూ. 40 లక్షల విలువైన 6 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని, ప్రధాన నిందితుడు యోగేష్ పాటిల్ (అమరావతి)తో పాటు నలుగురు స్థానిక ఏజెంట్లను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు.

ట్రాక్టర్ ఫైనాన్స్ బకాయిలు తామే తీరుస్తామని నమ్మించి, స్థానిక ఏజెంట్లకు ఒక్కో ట్రాక్టర్‌కు రూ. 10,000 కమిషన్ ఇచ్చి ఈ మోసానికి పాల్పడ్డారు. ఇంద్రవెల్లి, బేలా, ఉట్నూర్, తాంసి మండలాల నుండి మొత్తం 9 ట్రాక్టర్లు తరలించగా, ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేసి 6 ట్రాక్టర్లను రికవరీ చేశారు. నిందితులపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ఫైనాన్స్ బకాయిల పేరుతో వచ్చే గుర్తుతెలియని వ్యక్తులను నమ్మి వాహనాలు అప్పగించవద్దని, మోసపోతే వెంటనే పోలీసులను సంప్రదించాలని ఎస్పీ సూచించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.