Adilabad: బెల్లూరి అయ్యప్ప ఆలయ ఆరట్టు మహోత్సవానికి ఎస్పీకి ఆహ్వానం
Adilabad: ఆదిలాబాద్ పట్టణం బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో నవంబర్ 29న జరిగే ఆరట్టు మహోత్సవానికి హాజరుకావాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌కు నిర్వాహకులు ఆహ్వానించారు.
Adilabad: బెల్లూరి అయ్యప్ప ఆలయ ఆరట్టు మహోత్సవానికి ఎస్పీకి ఆహ్వానం
అదిలాబాద్: అదిలాబాద్ పట్టణంలోని బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో ఈనెల 29 వ తేదీ ఆదివారం నిర్వహించే అయ్యప్ప స్వామి అరట్టు ఉత్సవంలో పాల్గొనాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కు ఆహ్వాన పత్రికను అందించారు నిర్వాహకులు.. మలయాళ సంప్రదాయ పద్ధతిలో నిర్వహించే ఆరట్టు ఉత్సవంలో హాజరుకావాలని కోరారు.
ఉదయం స్థానిక శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం నుండి పట్టణ పురవీధుల గుండా ఠాగూర్ హోటల్ వరకు పల్లకి సేవ ఉంటుందని, అనంతరం సరిహద్దులోని పెన్ గంగా నదిలో స్వామివారి చక్రస్నానం ఉంటుందని, మధ్యాహ్నం ఆలయంలో అయ్యప్ప స్వాములకు భిక్ష, రాత్రి పడిపూజ మహోత్సవం ఉంటుందని తెలిపారు నిర్వాహకులు..
ఈ కార్యక్రమంలో బెల్లూరి అయ్యప్ప స్వామి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చందా గణేష్, తిప్పర్తి సత్యం, పూజ నిర్వాహకులు oklay స్కూల్ అధినేత సాయిని రవికుమార్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, సీనియర్ గురు స్వాములు మహేందర్ భూ శెట్టి, కృష్ణ గౌడ్, దారుట్ల హర్షవర్ధన్ తదితరులున్నారు..




