Adilabad: ఆదిలాబాద్ మున్సిపల్ అత్యవసర భేటీ రసాభాస!
Adilabad: ఆదిలాబాద్ మున్సిపల్ సర్వసభ్య అత్యవసర సమావేశం తీవ్ర రసాభాసగా మారింది. మీడియాను బయటకు పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కౌన్సిలర్లు బాయ్‌కాట్ చేశారు.
Adilabad: ఆదిలాబాద్ మున్సిపల్ అత్యవసర భేటీ రసాభాస!
ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ సర్వసభ్య అత్యవసర సమావేశం శుక్రవారం వాడివేడిగా సాగింది. చైర్ పర్సన్ బండారి అనూష అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో.. గౌరవ సభ్యులు తమ కాలనీలో నెలకొన్న సమస్యలపై ప్రశ్నించారు.
జీరో అవర్స్ లో సమస్యలపై మాట్లాడదామని చైర్ పర్సన్ చెప్పినప్పటికీ కౌన్సిలర్లు వినిపించుకోలేదు. దీంతో కొద్దిసేపు సభ వాడివేడిగా సాగింది. సమావేశ ప్రారంభమైన కొద్దిసేపటికి మీడియాను సమావేశం నుండి బయటకి పంపించారు. అనంతరం సమావేశాన్ని కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎం కౌన్సిలర్లు బైకాట్ చేశారు.




