Adilabad: నష్టపోయిన సోయా పంటను పరిశీలించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్!
Adilabad: ఆదిలాబాద్ జిల్లా రుయ్యడి గ్రామంలో దెబ్బతిన్న సోయా పంటను పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఎకరానికి రూ.50 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Adilabad: నష్టపోయిన సోయా పంటను పరిశీలించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్!
Adilabad: అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రుయ్యడి గ్రామంలో విగర్ కంపెనీ మాళవిక రకం సొయా సాగు చేసి పంట దెబ్బతిన్న పంట క్షేత్రాలను బి ఆర్ ఎస్ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. మాళవిక రకం సాగుతో జరిగిన నష్టంపై రైతులతో ఎమ్మెల్యే మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రతి కష్టకాలంలో రైతులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.
పంట నష్టానికి సంబంధించిన వివరాల ఆధారంగా జిల్లా కలెక్టర్ ఎస్పీలు జోక్యం చేసుకొని మాళవిక కంపెనీపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కంపెనీ నుంచి ఎకరానికి రూ. 50 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాల బారిన పడి పోయిన సోయా రైతులను ఆదుకోకపోతే రైతులకు మద్దతుగా కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు అనిల్ జాదవ్..




