Ichoda: ఆదిలాబాద్ నుండి శబరిమలకు మహా పాదయాత్ర ప్రారంభం

Ichoda: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ నుండి శబరిమల అయ్యప్ప సన్నిధానానికి 10 మంది స్వాములతో మహా పాదయాత్ర ప్రారంభమైంది. తొలిసారిగా పాత్రికేయుడు ప్రవీణ్ గురుస్వామి పాల్గొన్నారు.

NAGULA SATISH, BOATH
Published on: 13 Nov 2026 1:03 PM IST
Ichoda
X

Ichoda: ఆదిలాబాద్ నుండి శబరిమలకు మహా పాదయాత్ర ప్రారంభం

​ఐచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఐచ్చోడ మండల కేంద్రం నుండి శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానానికి మహా పాదయాత్ర అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 10 మంది అయ్యప్ప స్వాములు ఈ బృహత్తర యాత్రకు శ్రీకారం చుట్టారు. ​

ఈ మహా పాదయాత్రలో ఐచ్చోడ మండల కేంద్రానికి చెందిన పాత్రికేయుడు ప్రవీణ్ గురుస్వామి మొట్టమొదటిసారిగా పాల్గొనడం విశేషం. "స్వామియే శరణం అయ్యప్ప" అనే శరణుఘోషలతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న శబరిమల కొండకు కాలినడకన బయలుదేరిన ఈ స్వాముల బృందానికి స్థానిక భక్తులు, గ్రామస్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. మాలధారులు నిష్టతో, కఠిన నియమాలతో చేపట్టిన ఈ యాత్ర నిర్విఘ్నంగా సాగాలని ఆకాంక్షిస్తూ పలువురు ప్రముఖులు స్వాములకు శుభాకాంక్షలు తెలిపారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH