Adilabad: ఆదిలాబాద్ ఐటీ టవర్ పరిశీలించిన మాజీ మంత్రి జోగు రామన్న!
Adilabad: ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఐటీ టవర్‌ను సందర్శించిన మాజీ మంత్రి జోగు రామన్న. టవర్ ప్రారంభంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు.
Adilabad: ఆదిలాబాద్ ఐటీ టవర్ పరిశీలించిన మాజీ మంత్రి జోగు రామన్న!
Adilabad: బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్‌ను సందర్శించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, నీటి ప్రాజెక్టులు, విద్య వైద్యం ఆరోగ్యం, రవాణా సౌకర్యం, రైతు సంక్షేమం, అనే గ్రామాలలో పట్టణాలలో మౌలిక వసతులు పంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నీటి ప్రాజెక్టులు, తాగునీరు, విద్య, వైద్యం, రహదారులు, మౌలిక సదుపాయాలు, యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు ప్రాధాన్యతనిచ్చిందని అన్నారు. జిల్లాలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో మూడు ఎకరాల భూమితో పాటు సుమారు రూ.40 కోట్ల వ్యయంతో ఐటీ టవర్ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీ టవర్ ప్రారంభం, కార్యకలాపాల నిర్వహణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. కేవలం కమిషన్లు వచ్చే ప్రాజెక్టులకే పరిమితం కాకుండా, నిరుద్యోగ యువత భవిష్యత్తుకు ఉపయోగపడే ఐటీ టవర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
ఐటీ టవర్ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తే స్థానిక యువతకు సుమారు రెండు వేల ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని జోగు రామన్న పేర్కొన్నారు. ఈ అంశంపై పలుమార్లు ఐటీ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు లేఖలు కూడా రాసినట్లు తెలిపారు.




