Gudihathnoor: అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన ఆదివాసీ మహిళ, వ్యాపారి!
Gudihathnoor: గుడిహత్నూర్ మండలం గురుజ గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి కుమ్ర సునీత ఇల్లు, పక్కనే ఉన్న పిండి గిర్నీ దగ్ధమయ్యాయి. బాధితులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Gudihathnoor: అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన ఆదివాసీ మహిళ, వ్యాపారి!
గుడిహత్నూర్: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని గురుజ గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన కుమ్ర సునీత అనే ఆదివాసీ మహిళ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు ఇల్లంతా వ్యాపించడంతో సునీత ఇంట్లోని నిత్యావసర సరుకులు, విలువైన సామాగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి.
మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పక్కనే ఉన్న చోలే రాజు అనే వ్యక్తికి చెందిన పిండి గిర్నీ దుకాణానికి కూడా మంటలు వ్యాపించాయి. దీంతో పిండి గిర్నీ దుకాణంతో పాటు అందులోని యంత్రాలు, సరుకులు పూర్తిగా అగ్నికి ఆహుతై భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఇచ్చోడ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదంలో తీవ్రంగా నష్టపోయిన బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.




