Gudihathnoor: కోలాం గిరిజనుల సమస్యలు తెలుసుకున్న ఐటీడీఏ పీఓ!

Gudihathnoor: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని చెరకువాయి గ్రామాన్ని ఉట్నూర్ ఐటీడీఏ పీఓ మంద మకరందు సందర్శించి గిరిజనుల సమస్యలను, సంక్షేమ పథకాల అమలు తీరును తెలుసుకున్నారు.

NAGULA SATISH, BOATH
Published on: 16 Oct 2026 4:05 PM IST
Gudihathnoor
X

Gudihathnoor: కోలాం గిరిజనుల సమస్యలు తెలుసుకున్న ఐటీడీఏ పీఓ!

​గుడిహత్నూర్: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని చెరకువాయి కోలాం గిరిజన గ్రామాన్ని ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి మంద మకరందు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించిన ఆయన ప్రభుత్వం ద్వారా గిరిజనులకు అందుతున్న సంక్షేమ పథకాల అమలు తీరును గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు.

​స్థానిక అంగన్‌వాడీ కేంద్రం పనితీరుపై పీఓ ఆరా తీయగా, గ్రామంలో ప్రస్తుతం మినీ అంగన్‌వాడీ కేంద్రం మాత్రమే నడుస్తోందని గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అలాగే గ్రామానికి గతంలో మంజూరైన 12 ఇందిరమ్మ ఇళ్లలో ఇప్పటివరకు 8 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, ప్రస్తుతం కొత్తగా మరో 3 ఇళ్లు మంజూరయ్యాయని అధికారులు, స్థానికులు వివరించారు.

గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు విన్నవించగా, ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తానని పీఓ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గుడిహత్నూర్ తహసీల్దార్ కవితా రెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH