Adilabad: 9 వేల దారపు ఉండలతో వినూత్న వినాయక ప్రతిష్ట

Adilabad: అదిలాబాద్ బుక్తాపూర్ కాలనీలో 9 వేల దారపు ఉండలతో పర్యావరణ హితంగా వినాయక ప్రతిష్ట. గతంలో పెన్నులు, గొడుగులతో విగ్రహాలు తయారుచేసిన యువకులు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 16 Sept 2026 7:55 PM IST
Adilabad
X

Adilabad: 9 వేల దారపు ఉండలతో వినూత్న వినాయక ప్రతిష్ట

అదిలాబాద్: అదిలాబాద్ పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్థానిక బుక్తాపూర్ కాలనీలోని బాల గణేష్ మండలి వారు ప్రతిష్టించిన 9 వేల దారపు ఉండల వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.

తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రతి ఏటా కూడా వినూత్నంగా పర్యావరణ పరిరక్షణను మెసేజ్ చేస్తూ ఇక్కడ యువకులు వినూత్నంగా ప్రతిష్టిస్తున్నారు.

గత రెండు పెన్నులు పెన్సిళ్లు నోట్బుక్ తో తయారుచేసిన వినాయకుడిని ప్రతిష్టించడంతోపాటు కేవలము గొడుగులతో తయారుచేసిన వినాయకుని కూడా గతంలో ప్రతిష్టించి ఆదర్శంగా నిలిచారు.

ఈసారి 9 వేల దారపు ఉండలతో వినాయకుని ప్రతిష్టించగా, ఈ వినాయకుని దర్శనం కోసం జనం భారీగా తరలివస్తున్నారు...

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.