Adilabad: దస్నాపూర్ మైదాన స్థలంపై వివాదం దేడియా సమాజ్ ఆగ్రహం!
Adilabad: హిందూ ఉత్సవ సమితి దస్నాపూర్ మైదానం స్థలం విరాళంపై అసత్య ప్రచారం. బజరంగ్ అగ్రవాల్‌కు లీగల్ నోటీసులు ఇస్తామన్న దేడియా సమాజ్ ప్రతినిధి జగదీష్ అగర్వాల్.
Adilabad: దస్నాపూర్ మైదాన స్థలంపై వివాదం దేడియా సమాజ్ ఆగ్రహం!
Adilabad: ఆదిలాబాద్ లోని హిందూ ఉత్సవ సమితి యొక్క దస్నాపూర్ మైదానం స్థలాన్ని తాను ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్న భజరంగ్ అగ్రవాల్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని దేడియా సమాజ్ ప్రతినిధి జగదీష్ అగర్వాల్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని రాణిసతిజీ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమాజ్ ప్రతినిధులతో కలిసి పాల్గొని ఆయన మాట్లాడారు. దస్నాపూర్ మైదానం స్థలాన్ని దేడియా పరివార్ వారు విరాళంగా ఇచ్చారన్నారు. అసత్య ప్రచారం చేసుకుంటున్నా బజరంగ్ అగ్రవాల్ కు లీగల్ నోటీసులు అందజేస్తామని తెలిపారు. ప్రజలు అసత్య ప్రచారాలు నమ్మవద్దని కోరారు.




