Adilabad: నవంబర్ 1న ఢిల్లీ సభను విజయవంతం చేయాలి: కాంగ్రెస్!

Adilabad: ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ ‘ఓటు బచావో – దేశ్ బచావో’ సదస్సు జరిగింది. నవంబర్ 1న ఢిల్లీలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఏఐసీసీ అబ్జర్వర్ మురియప్పన్ పిలుపునిచ్చారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 27 Oct 2026 5:53 PM IST
Adilabad
X

Adilabad: నవంబర్ 1న ఢిల్లీ సభను విజయవంతం చేయాలి: కాంగ్రెస్!

ఆదిలాబాద్: SIR ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, ప్రజాస్వామ్య పరిరక్షణ మరియు ఓటు హక్కు కాపాడే లక్ష్యం.. “ఓటు బచావో – దేశ్ బచావో అభియాన్” కార్యక్రమాన్ని మంగళవారం ఆదిలాబాద్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐసీసీ అబ్జర్వర్ మురియప్పన్, కోఆర్డినేటర్, శ్రవణ్ కుమార్ హాజరయ్యారు. నవంబర్ 1న న్యూఢిల్లీలో ఓట్ బచావో - దేశ్ బచావో కార్యక్రమం భారీ బహిరంగ సభ విజయవంతరానికి తీసుకోవాల్సిన కార్యాచరణ పై నాయకులకు దిశా నిర్దేశం చేశారు.

దేశంలో ప్రజాస్వామ్యానికి, ప్రతి ఒక్క పౌరుడి ఓటింగ్ హక్కుకు తీవ్ర ముప్పు వాటిల్లుతోందని, కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై రాహుల్ గాంధీ గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఏఐసీసీ అబ్జర్వర్ మురియప్పన్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం చట్టబద్ధమైన సంస్థ అయినప్పటికీ, దానిలో పారదర్శకత మరియు జవాబుదారీతనం పూర్తిగా కొరవడ్డాయని ఆరోపించారు.

సీఈసీ తప్పుడు నిర్ణయాలు మరియు ఏకపక్ష విధానాల వల్ల ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, రాజ్యాంగ హక్కులను కాపాడేందుకు రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి అందరూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. నవంబర్ 1న ఢిల్లీలో బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.