Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో కలెక్టర్ రాజర్షి షా ఆకస్మిక తనిఖీ!
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో కలెక్టర్ రాజర్షి షా ఆకస్మిక తనిఖీ పారిశుద్ధ్యంపై అసహనం ఓబీజీ వార్డు సమస్యలు 2 రోజుల్లో పరిష్కారం, అభివృద్ధికి రూ.13 కోట్లు మంజూరు.
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో కలెక్టర్ రాజర్షి షా ఆకస్మిక తనిఖీ!
ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో సోమవారం సాయంత్రం కలెక్టర్ రాజర్షిషా ఆకస్మికంగా తనిఖీ చేసి పలు వార్డులను పరిశీలించారు. వైరింగ్, ఆక్సిజన్ పైపులు, శానిటేషన్, వైద్యులు తదితర అంశాలపై ఆరా తీశారు. మరోవైపు ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకపోవడంతో సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఇటీవల SNCU వార్డు ఘటన నేపథ్యంలో ఎప్పటికప్పుడు రిమ్స్‌పై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు.
రిమ్స్ ఆసుపత్రిలోని సమస్యలను వైద్యులతో సమీక్షించినట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. OBG వార్డులోని ఉన్న సమస్యలను 2 రోజుల్లో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఆసుపత్రి అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం నుంచి రూ.13 కోట్లు మంజూరు అయ్యాయని వివిధ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనులను చేయాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో రోగులు, సహాయకులు నిబంధనలు పాటించి సహకరించాలన్నారు.




