Adilabad: ఉద్యోగార్థులతో ఆదిలాబాద్ కలెక్టర్ పంక్తి భోజనం!
Adilabad: ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్‌లో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులతో కలెక్టర్ రాజర్షి షా పంక్తి భోజనం ఇస్కాన్ ఆధ్వర్యంలో 2 నెలల ఉచిత అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభం.
Adilabad: ఉద్యోగార్థులతో ఆదిలాబాద్ కలెక్టర్ పంక్తి భోజనం!
అదిలాబాద్: కలెక్టర్ సహా పంక్తి భోజనం.. అదిలాబాద్ బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో స్థానిక బీసీ స్టడీ సర్కిల్‌లో కానిస్టేబుల్, సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉద్యోగాల కోసం ఎంపికైన 200 మంది అభ్యర్థులకు 60 రోజుల ఉచిత శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది.
శిక్షణ పొందుతున్న అభ్యర్థుల సౌకర్యార్థం ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో రెండు నెలల పాటు ఉచిత అన్నప్రసాద సేవ కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఉచితంగా పోషకాహారంతో కూడిన అన్నప్రసాదాన్ని అందిస్తున్న ఇస్కాన్ నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు కష్టపడి చదివి, అందుబాటులో ఉన్న శిక్షణ, వసతులను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.
అనంతరం కలెక్టర్ స్వయంగా అభ్యర్థులకు భోజనం వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థుల శిక్షణ, పరీక్షల సన్నద్ధత, ప్రిపరేషన్ విధానంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఇస్కాన్ టెంపుల్ ప్రతినిధి ప్రణవ నంద ప్రభుజీ, బీసీ సంక్షేమ శాఖ అధికారి సోనియా, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్, శిక్షణార్థులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




