Indervelli: గిరిజనులతో కలిసి గర్భ నృత్యం చేసిన కలెక్టర్, మిస్ ఎర్త్ ప్రీతీ ముండే
Indervelli: ఇంద్రవెల్లి అందునాయక్ గ్రామంలోని శ్రీ జ్వాలాముఖి దుర్గామాత ఆలయంలో ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పూజలు చేసి, గిరిజనులతో కలిసి నృత్యం చేశారు.
Indervelli: గిరిజనులతో కలిసి గర్భ నృత్యం చేసిన కలెక్టర్, మిస్ ఎర్త్ ప్రీతీ ముండే
ఇంద్రవెల్లి: ఇంద్రవెల్లి మండలం అందునాయక్ గ్రామంలో కొలువైన శ్రీ జ్వాలాముఖి దుర్గామాత ఆలయంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న కలెక్టర్, జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
దేవీ ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక వేడుకల్లో కలెక్టర్ రాజర్షి షాతో పాటు మిస్ ఎర్త్ వాటర్ ఇండియా 2026 విజేత ప్రీతీ ముండే ముఖ్య ఆకర్షణగా నిలిచారు. స్థానిక గిరిజన సంప్రదాయాలకు ప్రతీకగా సాగిన గర్భ నృత్యాల్లో కలెక్టర్ మరియు ప్రీతీ ముండే ఉత్సాహంగా పాల్గొని గిరిజనులతో కలిసి లయబద్ధంగా అడుగులు వేసి అందరినీ అలరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు మన సమాజానికి విశిష్ట గుర్తింపునిస్తాయని తెలిపారు. తరతరాలుగా వస్తున్న ఆచారాలను కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. గిరిజన కళలకు, సంస్కృతికి తగిన ప్రోత్సాహం అందించాలని పిలుపునిచ్చారు.
ఈ వేడుకల్లో స్థానిక తహసీల్దార్ ప్రవీణ్, రాంసింగ్ మహారాజ్, ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.




