Adilabad: ఆదిలాబాద్‌లో కుంటాల జలపాత విద్యార్థుల విహారయాత్ర ప్రారంభం!
Adilabad: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద కుంటాల జలపాత విద్యార్థుల విహారయాత్రను జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా.
Adilabad: ఆదిలాబాద్‌లో కుంటాల జలపాత విద్యార్థుల విహారయాత్ర ప్రారంభం!
Adilabad: ప్రపంచ పర్యాటక దినోత్సవం–2026ను పురస్కరించుకొని ‘తెలంగాణ దర్శిని’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ‘యువ పర్యాటక క్లబ్’ల విద్యార్థుల కుంటాల జలపాతం విహారయాత్రను ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఎదుట జెండా ఊపి ప్రారంభించారు.పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థుల్లో తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలు, చారిత్రక ప్రదేశాలు, ప్రకృతి వనరులపై అవగాహన పెంపొందించడంతో పాటు రాష్ట్రంలోని పర్యాటక విశిష్టతలను పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇందులో భాగంగా యువ పర్యాటక క్లబ్‌లకు చెందిన విద్యార్థులు కుంటాల జలపాతాన్ని సందర్శించి అక్కడి ప్రకృతి అందాలు, పర్యావరణ పరిరక్షణ, పర్యాటక ప్రాధాన్యత తదితర అంశాలను తెలుసుకోనున్నారు.విద్యార్థులు పర్యాటక ప్రాంతాలను సందర్శించే సమయంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, ప్రకృతి సంపదను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందనే విషయాన్ని గుర్తించాలని అధికారులు సూచించారు. యువతలో పర్యాటక ప్రాంతాలపై ఆసక్తి పెంపొందించడం ద్వారా భవిష్యత్‌లో పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి రవికుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




