Adilabad: ఫుడ్ సేఫ్టీ అధికారిణిపై బెదిరింపులు.. కేసు నమోదు!
Adilabad: ఆదిలాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారిణిపై బెదిరింపులు, అనుచిత వ్యాఖ్యలు ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ దినేష్ మటోలియాపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు సీఐ సునిల్ కుమార్ వెల్లడి.
Adilabad: ఫుడ్ సేఫ్టీ అధికారిణిపై బెదిరింపులు.. కేసు నమోదు!
ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ దినేష్ మటోలియాపై కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ బి.సునిల్ కుమార్ తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అధికారిణి ప్రత్యూష ఓ దుకాణాన్ని తనిఖీ చేసి పల్లీల నమూనాలను సేకరించారు. అనంతరం అది తనకు పరిచయం ఉన్న వారి దుకాణం అంటూ పల్లీలను సీజ్ చేయవద్దు అంటూ తెలియజేసి, సీజ్ చేసిన ఎడల మీరు జిల్లాలో విధులు ఎలా నిర్వహిస్తారు.
అంటూఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ బెదిరింపులకు పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో తెలిపారు. అనంతరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ తన వాట్సాప్ స్టేటస్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారిణి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ అభ్యంతరకర వ్యాఖ్యలతో స్టేటస్ పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై ఫుడ్ సేఫ్టీ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.




