Adilabad: పత్తి పంటలో గంజాయి సాగు నిందితుడి అరెస్ట్, 6 లక్షల మొక్కలు స్వాధీనం
Adilabad: అదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలంలో పత్తి పొలంలో గంజాయి సాగు చేస్తున్న నిందితుడు అరెస్ట్. రూ.6 లక్షల విలువైన మొక్కలను స్వాధీనం చేసుకున్న ఉట్నూర్ పోలీసులు.
Adilabad: పత్తి పంటలో గంజాయి సాగు నిందితుడి అరెస్ట్, 6 లక్షల మొక్కలు స్వాధీనం
అదిలాబాద్: అదిలాబాద్ జిల్లాలో గంజాయి సాగు పై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు .. పత్తి పంటలో అంతర్ పంటగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పట్టుకొని సుమారు 6 లక్షల రూపాయల విలువైన గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ఉట్నూర్ ఏఎస్పీ రూత్విక్ సాయి కొట్టే తెలిపారు.
జిల్లాలోని గాదిగూడ మండలం పరస్వాడ-బి గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో పత్తి పంటలో అంతర పంటగా అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న సమాచారంతో దాడులు నిర్వహించి నిందితున్ని అరెస్ట్ చేశారు పోలీసులు... సదరు నిందితుడు పత్తిలో గోప్యంగా గంజాయి సాగు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో తనిఖీలు నిర్వహించగా 60 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
సుమారు 1 నుంచి 3 అడుగుల ఎత్తు పెరిగిన 60 గంజాయి మొక్కల విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. సులభంగా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తన తండ్రి వ్యవసాయ భూమిలో పత్తి పంటతో పాటు గంజాయి మొక్కలను సాగు చేసినట్లు నిందితుడు విచారణలో వెల్లడించినట్లు తెలిపారు.
కోడప మారుతి S/o పగ్గు, వయస్సు 34 సంవత్సరాలు, వృత్తి: రైతు, నివాసం: పరస్వాడ-బి, గడిగూడ మండలం.గంజాయి సాగు, విక్రయం, రవాణాకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఉట్నూర్ ASP రిత్విక్ సాయి కొట్టే తెలిపారు. గంజాయి సాగు లేదా అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.ఈ దాడిలో నార్నూర్ సీఐ అంజమ్మ, ఎస్సై రమ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




