Adilabad: మాజీ సీఎం కేసీఆర్‌తో యువనేత భార్గవ్ దేశ్‌పాండే మర్యాదపూర్వక భేటీ
Adilabad: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆదిలాబాద్ యువనేత భార్గవ్ దేశ్‌పాండే మర్యాదపూర్వకంగా కలిశారు. రైతు గర్జన సక్సెస్‌పై కేసీఆర్ అభినందనలు తెలిపారు.
Adilabad: మాజీ సీఎం కేసీఆర్‌తో యువనేత భార్గవ్ దేశ్‌పాండే మర్యాదపూర్వక భేటీ
అదిలాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు అదిలాబాద్ కు చెందిన గులాబీ పార్టీ యువనేత భార్గవ్ దేశ్ పాండే..భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని మర్యాదపూర్వకంగా కలిసిన BRS యువ నాయకులు శ్రీ భార్గవ్ దేశ్ పాండే.. అదిలాబాదులో ఇటీవల నిర్వహించిన రైతు గర్జన విజయవంతం పై అభినందించారు.
ఈ సందర్భంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై జరిగే పోరాటానికి యువత సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.బంగారు తెలంగాణ పునఃనిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని, తెలంగాణ అభివృద్ధి కోసం యువత ముందుండి పనిచేయాలని ఆయన ఆకాంక్షించినట్లు భార్గవ్ ఒక ప్రకటనలో తెలిపారు.




