Adilabad: ఈసీపై అనుమానమైతే రాజీనామా చేయండి: పాయల్ శంకర్!
Adilabad: ఈసీ, ఈవీఎంలపై అనుమానాలుంటే సీఎం, మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సవాల్ విసిరారు.
Adilabad: ఈసీపై అనుమానమైతే రాజీనామా చేయండి: పాయల్ శంకర్!
ఆదిలాబాద్: ఎన్నికల కమిషన్ తీరుపై, ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న ముఖ్యమంత్రికి, కేబినెట్ మంత్రులకు ధైర్యముంటే వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సవాల్ విసిరారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎన్నికల కమిషన్ ఇచ్చిన సర్టిఫికెట్లతో పదవులుఅనుభవిస్తూ.. ఈరోజు ఈసీ వ్యవస్థపైనే ప్రశ్నలు గుప్పించడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ విదేశీ కుట్రల ప్రభావంతో దేశంలో అరాచకం సృష్టించేందుకు యత్నిస్తోందని ఆరోపించారు.రాష్ట్ర సమస్యలను వదిలేసి మంత్రులు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు, నీరు లేక రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచినప్పుడు సక్రమంగా పనిచేసిన ఈవీఎంలు, ఎన్నికలు ఓడిపోయినప్పుడు తప్పు పట్టడం సరికాదని ఎద్దేవా చేశారు.




