Adilabad: రిమ్స్ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి

Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ పసికందుల మృతి ఘటన ప్రభుత్వ తప్పిదమేనన్న బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 22 Sept 2026 6:41 PM IST
Adilabad
X

Adilabad: రిమ్స్ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి

ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ లో ముగ్గురు పసికందుల మృతి పై ఓ ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, నిర్మల్ జిల్లా బిజెపి అధ్యక్షుడు రితేష్ రాథోడ్ .. రిమ్స్ ఘటనపై ప్రభుత్వం తక్షణమే కమిటీ వేసి, సమగ్ర విచారణ జరిపించాలని , ప్రమాద ఘటనలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకునే ప్రకటన సంబంధిత శాఖ మంత్రి చేయకపోవడం విచారకరమని అన్నారు.

అగ్ని ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు పసికందు కుటుంబాలను ఆదుకోవాలని, ఏ విధంగా వివిధ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల కు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు మహేశ్వర్ రెడ్డి..ప్రభుత్వ ఆసుపత్రులు పేద మధ్య తరగతి ప్రజలకు ప్రాణదారంగా ఉండాలని ప్రభుత్వం,సిబ్బంది నిర్లక్ష్యంతో ఇలాంటి ఘటనలు జరగడం విచారకరమని ఆయన పేర్కొన్నారు.

ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే కమిటీ వేసి న్యాయవిచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అగ్ని ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు పసికందు కుటుంబాల కు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.