Adilabad: ఆదిలాబాద్ డైట్ గ్రౌండ్‌లో దసరా ఏర్పాట్లకు భూమి పూజ
Adilabad: ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ మైదానంలో దసరా ఉత్సవాలు, రావణ దహన కార్యక్రమ ఏర్పాట్లకు సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదివారం శాస్త్రోక్తంగా భూమి పూజ జరిగింది.
Adilabad: ఆదిలాబాద్ డైట్ గ్రౌండ్‌లో దసరా ఏర్పాట్లకు భూమి పూజ
Adilabad: అదిలాబాద్ పట్టణంలోని డైట్ మైదానంలో దసరా ఉత్సవాలు, రావణ దహన కార్యక్రమానికి సంబంధించి సనాతన హిందూ ఉత్సవ సమితి వారు నిర్వహించే ప్రతీ కార్యక్రమం కూడా సమాజ హితం కొరకు నిర్వహించడం జరుగుతుందని సనాతన హిందూ ఉత్సవ సమితి నిర్వాహకులు తెలిపారు.
దసరా సందర్భంగా డైట్ మైదానంలో రావణ దహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా ఆదివారం డైట్ కళాశాల మైదానం లో నిర్వహించే దసరా ఉత్సవాలను కోసం చేపట్టే ఏర్పాట్లు, రావణ దహన కార్యక్రమం భూమి పూజ కార్యక్రమంలో కాంగ్రెస్ ఇంచార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి సతీమణి సాయి మౌన రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్ మాట్లాడుతూ గత 14 సంవత్సరాల నుండి సమితి ఆధ్వర్యంలో ఈ దసరా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఇందులో పట్టణ ప్రజల తో పాటు చుట్టూ ప్రక్కల గ్రామీణ ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ భూమి పూజ లో సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించడం జరిగింది ఇందులో సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి తో పాటు వేద పండితులు సంతోష్ శర్మ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ DR క్రాంతి దంపతులు డా : రజిత గౌరవ అధ్యక్షులు కందుల రవీందర్, ప్రధాన కార్యదర్శి రేణికుంట రవీందర్, కోశాధికారి సంతోష్ అగర్వాల్,కార్యనిర్వహక అధ్యక్షులు దశరథ్ , ఉపాధ్యక్షులు సమనపల్లి నర్సింలు , సురేష్ పౌడవాల్ , మహిపాల్ , సుభాష్ ఉరడే ,తిరుపతి రెడ్డి, విజయ్ తదితరులు పాల్గొన్నారు..




