Adilabad: ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముందే నేతల బాహాబాహి.. తీవ్ర ఉద్రిక్తత!

Adilabad: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ సమక్షంలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమంలో ఫోటో దిగే విషయంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఘర్షణకు దిగారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 17 Nov 2026 10:35 AM IST
Adilabad
X

Adilabad: ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముందే నేతల బాహాబాహి.. తీవ్ర ఉద్రిక్తత!

అదిలాబాద్: అదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో నిర్వహించిన చేయూత ప్రొసీడింగ్ పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మండలంలోని బెదోడ గ్రామపంచాయతీ పరిధిలోని పింఛన్ లబ్ధిదారులకు అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేస్తున్న సమయంలో బీజేపీ మాజీ సర్పంచ్,

కాంగ్రెస్ ఉప సర్పంచ్ మధ్య ఫోటో దిగే విషయంలో మొదలైన వివాదం ఘర్షణకు దారితీసింది. అనంతరం ఇద్దరు నేతల మద్దతు దారులు బాహా బాహికి దిగి పిడిగుద్దులు గుద్దుకోవడంతో కార్యక్రమ ప్రాంగణంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొనగా, అక్కడ ఉన్న ఎమ్మెల్యే తో పాటు అధికారులు ఇరువర్గాలను సముదాయించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.