Adilabad: రూ.40 వేలు లంచం తీసుకుంటూ దొరికిన ఎస్సై!

Adilabad: ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్‌ ఎస్సై రమేష్ ఒక కేసు వ్యవహారంలో రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

NAGULA SATISH, BOATH
Published on: 4 Nov 2026 4:14 PM IST
Adilabad
X

Adilabad: రూ.40 వేలు లంచం తీసుకుంటూ దొరికిన ఎస్సై!

​ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్‌ మండల ఎస్సై రమేష్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఒక కేసుకు సంబంధించిన విషయంలో బాధితుడి నుంచి రూ. 40 వేలు లంచం డిమాండ్ చేసి, నగదును ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

​బాధితుడు ఇచ్చిన పక్కా సమాచారం, ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ బృందం పక్కా వ్యూహంతో ఈ దాడి నిర్వహించింది. ఎస్సై రమేష్ నుంచి లంచం సొమ్ము రూ. 40 వేలను స్వాధీనం చేసుకొని, ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఎస్సైపై కేసు నమోదు చేసి లోతుగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH