Bazarhathnoor: అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు: సుదర్శన్ రెడ్డి!
Bazarhathnoor: ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్లో ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే అనిల్ జాదవ్, కలెక్టర్ రాజర్షి షా నూతన పెన్షన్, ఇందిరమ్మ బీమా పత్రాలను పంపిణీ చేశారు.
Bazarhathnoor: అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు: సుదర్శన్ రెడ్డి!
బజార్హత్నూర్: అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం బజార్హత్నూర్ మండల కేంద్రంలో నిర్వహించిన నూతన చేయూత పెన్షన్ మంజూరు పత్రాలు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్, జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా రూ.5 లక్షల భరోసా కల్పించేందుకే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా తెచ్చామన్నారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి, మారుమూల ప్రాంతాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, జిల్లాలో మంజూరైన 14,579 కొత్త పెన్షన్లలో బోథ్ నియోజకవర్గంలో 6 వేలు, బజార్హత్నూర్ మండలంలో 600కు పైగా ఉన్నాయని తెలిపారు. పెండింగ్ సదరం ధ్రువీకరణల కోసం ఈ నెలలో వైద్య శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు. మీసేవకు వెళ్లకుండానే ఆధార్, రేషన్ లేదా ఓటరు కార్డు, మొబైల్ నంబర్‌తో గ్రామ శిబిరాల్లో బీమా నమోదు చేసుకోవాలని సూచించారు.
అనంతరం లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, సర్పంచ్ పరచ సాయన్న, డీఆర్డీఓ రవీందర్ రాథోడ్, తహసీల్దార్ శ్యాంసుందర్, ఎంపీడీవో మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.




